బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 5 జులై 2016 (09:45 IST)

మిఠాయి ఆశ చూపించాడు... 14 యేళ్ళ బాలికపై అత్యాచారం

తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై 14 యేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో భద్రంగా దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన

తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై 14 యేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో భద్రంగా దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకివెళితే... చిన్నారి ఇంటి పక్కనే నివసించే నిందితుడు శనివారం పాపకు మిఠాయి ఆశచూపించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయాన్ని పాప ఎక్కడ బయట చెబుతుందోనని భయపడి... భయంతో గొంతు పిసికి చంపి, వంటపాత్రలో దాచాడు. పాప కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారాణ చేపట్టారు. పాపను ఇంటిపక్కన ఉండే అబ్బాయి తీసుకెళ్లినట్లు విచారణలో స్థానికులు వెల్లడించారు. ఇంట్లో పాప శవం దొరకడంతో నిందితుడు నేరాన్నిపోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో పోలీసులు బాలుడిపై కేసు నమోదుచేసుకుని విచారణ చేపడుతున్నారు.