1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

డీప్ ఫ్రైడ్ ఫిష్

డీప్ ఫ్రైడ్ ఫిష్ లీన్ ఫిష్ ఉల్లికాడల ముక్కలు పచ్చిమిర్చి అల్లం పేస్టు ఉప్పు పెప్పర్
కావలసిన పదార్థాలు :
లీన్ ఫిష్... 500 గ్రాములు
ఉల్లికాడల ముక్కలు... 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి ముక్కలు... ఒక టీస్పూను
అల్లం పేస్టు... పావు టీస్పూను
మైదా... ఒక కప్పు
ఉప్పు, పెప్పర్... రుచికి సరిపడా

తయారీ విధానం :
చేపలు తప్ప మిగిలిన వస్తువులన్నింటినీ ఒక గిన్నెలో వేసి సరిపడా నీరు పోసి పేస్టులాగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్క చేప ముక్కను ఆ పేస్టులో ముంచి తీసి కాగే నూనెలో వేసి ఎర్ర వేయించుకోవాలి.

తరువాత ఆ ముక్కలను తీసి ప్లేట్లలో అందంగా సర్ది, టొమోటో కెచెప్‌లో చిల్లీ సాస్ కలిపి, చేపల ముక్కలతో వేడి వేడిగా అతిథులకు వడ్డించాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి