శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2020 (13:30 IST)

ఫ్రాన్స్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్, మళ్లీ లాక్ డౌన్ ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి శరవేగం ఉధృతంగా మారుతున్నది. ప్రాన్స్‌లో కరోనా వ్యాప్తి శరవేగంగా వ్యాప్తి చెందడంతో ఆ దేశం మళ్లీ లాక్ డౌన్ ప్రకటించింది. పరిస్థితి హద్దులు దాటక ముందే తగు చర్యలను చేపట్టాలని భావించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ నిన్న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.
 
ఇది డిసెంబరు 1 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమైందని, ఇది మొదటి దశ కంటే చాలా ప్రమాదకరమైనదని అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఈ సందర్భంగా దేశంలోని అత్యవసర దుకాణాలు తప్ప మిగతా అన్నీ మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
 
ప్రజలు బయటకు రావాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల దగ్గర రాతపూర్వక అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు హద్దులు దాటితే దాదాపు 4 లక్షల మరణాల వరకు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు వారాల క్రితమే ప్యారిస్ ప్రధాన పట్టణాలలో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందేనని తెలిపారు.