సంబంధిత వార్తలు
- ఈ రంజాన్ మాసంలో దుబాయ్‌లో ఐదు ముఖ్యమైన ఇఫ్తార్ ప్రదేశాలు
- Champions Trophy: దక్షిణాఫ్రికాపై కివీస్ గెలుపు.. సచిన్ రికార్డును బ్రేక్ చేసిన రచిన్ రవీంద్ర (video)
- Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్- విరుష్క వీడియో వైరల్ (video)
- India vs Australia : మెరిసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆసీస్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపు.. రికార్డుల పంట
- Virat Kohli: అద్భుత రికార్డు.. 701 పరుగులు.. శిఖర్ ధావన్ రికార్డ్ బ్రేక్
మహ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగాడు.. రోజాను పాటించలేదు.. పాపి... రిజ్వీ బరేల్వీ
shami
ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రిజ్వీ బరేల్వీ షమీని విమర్శించారు. ఈ క్రికెటర్ ఉపవాసం పాటించకపోవడం ద్వారా మతపరమైన నిబంధనలను ఉల్లంఘించాడని పేర్కొన్నారు. "షమీ మత నియమాలను ఉల్లంఘించాడు.. పాపి" అని రిజ్వీ ఆరోపించారు.
ఆరోగ్యవంతమైన పురుషుడు లేదా స్త్రీ రోజాను పాటించకపోతే వారు నేరస్థులు అవుతారు. భారత క్రికెటర్ మహ్మద్ షమీ మ్యాచ్ సమయంలో నీరు లేదా ఏదో డ్రింక్ తాగాడు. షమీ ఆట ఆడుతున్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఆరోగ్యంగా ఉన్న షమీ ఉపవాసం ఎందుకు చేయలేదు.. అని మౌలానా షాబుద్దీన్ అన్నారు.
షమీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. భారత జట్టులోని కీలక బౌలర్లలో షమీ ఒకడు. చాలా సందర్భాలలో షమీ తన బౌలింగ్ తో జట్టును విజయపథంలో నడిపించాడు.సెమీ-ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.
విమర్శలు ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మరియు క్రికెట్ సమాజంలో షమీకి విస్తృత మద్దతు లభించింది. చాలా మంది నెటిజన్లు ఆయనను సమర్థించారు. ఆయన ఏ తప్పు చేయలేదని నొక్కి చెప్పారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, క్రికెట్‌ను మతంతో కలపవద్దని ప్రజలను కోరారు.
