1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Javed Miandad breaks down, urges Imran Khan’s release: He is a national hero

ఇమ్రాన్ ఖాన్ అవినీతిపరుడా? మియాందాద్ ఏమంటున్నారు?

imran khan
పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఆ దేశ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ అవినీతిపరుడుగా ముద్రవేసి జైల్లో పెట్టారు. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెట్ జావెద్ మియాందాద్ స్పందించారు. ఒకపుడు ఇమ్రాన్ ఖాన్ సహచరుడుగా ఉన్న మియాందాద్ తాజాగా చేసిన ఓ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తన మిత్రుడు ఇమ్రాన్ ఖాన్ అవినీతి పనులు చేసివుండడని వ్యాఖ్యానించాడు. 
 
'ఇమ్రాన్‌ ఖాన్ నిజాయతీపరుడే. అవినీతి పనులు చేసే వ్యక్తి కాదు. అలాంటివాడే అయితే ఇంకా ఎన్నో చేసేవాడు కదా. ఒకవేళ ఇప్పుడు ఇమ్రాన్‌ను వదిలేస్తే ఏం జరుగుతుంది? అతడు ఎవరికైనా హాని చేస్తాడా? అతడు కూడా ఒకరికి కుమారుడే. అతడు ఏం చేస్తుంటాడా? అని నేనెప్పుడూ ఆలోచిస్తూనే ఉంటా' అని జావెద్ మియాందాద్‌ వెల్లడించారు.
 
ఇమ్రాన్‌ ఖాన్‌కు మెరుగైన వైద్యం అందించాలని సునీల్ గావస్కర్, గ్రెగ్ ఛాపెల్‌తో సహా దాదాపు 21 మంది మాజీ కెప్టెన్లు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరిఫ్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్‌ కూడా తన మద్దతును తెలియజేశాడు. 'గ్రెగ్‌ ఛాపెల్‌తోపాటు మాజీ సారథులందరికీ మద్దతు ఇస్తున్నా. కోర్టు ఆదేశించిన వైద్య పరీక్ష పూర్తి అయ్యేలా అనుమతించాలని సూచిస్తున్నా. అలాగే కుటుంబ సభ్యులను చూసేందుకు అనుమతించాలి. ఇమ్రాన్‌ ఖాన్‌కు దక్కాల్సిన కనీస గౌరవ మర్యాదలను అందించాలని కోరుకుంటున్నా' అని కమిన్స్‌ పోస్టు చేశాడు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆస్ట్రేలియా క్రికెట్‌లో సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్