సంబంధిత వార్తలు
- కోట్ల మంది హృదయాలు భగ్నమయ్యాయి.. కానీ పోరాటం అద్భుతం (video)
- గంగూలీ బర్త్ డేకి సరప్రైజ్ చేసిన సచిన్ టెండ్కూలర్
- టీమిండియా 5 ఓవర్లలో 6 పరుగులా? 10 ఓవర్లకి 4 వికెట్లు... ఎవరన్నా అనుకున్నారా?
- సెమీస్ మ్యాచ్ నల్లేరుపై నడక కాదు... ఇలా చేస్తేనే గెలుపు : సచిన్
- వరల్డ్ కప్ 2019: సెమీఫైనల్స్ ఆడే ముందు భారత్ ఏం చేయాలి?
ఆ చిన్న పొరపాటు వల్లే భారత్ ఓడిందా?
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ముంగిట వరకు వచ్చి చివరకు 18 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. దీనిపై భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. భారత్ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
ముఖ్యంగా, టాపార్డర్ బ్యాట్స్‌మెన్లు కీలక మ్యాచ్‌లో విఫలం కావడం చాలా బాధ కలిగించిందన్నారు. అయితే, ధోనీ క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించిందనీ, ధోనీతో కలిసి రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడారు.
భారత్‌ను భారీ ఓటమి నుంచి తప్పించిన రవీంద్ర జడేజా, ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇది జడేజా కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది. వీర్దిదరూ ఏడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి విజయానికి బాటలు వేశారు. కానీ మ్యాచ్ ఆఖరులో ఒత్తిడికి లోనయ్యి వికెట్లు కోల్పోవడంతో ఓటమి ఖాయమైంది.
ఇదిలావుంటే, ధోనీ రనౌట్ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అలాగే, ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా బదులు ఎం.ఎస్. ధోనీ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అలా వచ్చి ఉంటే ధోనీ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేసేవాడని.. అప్పుడు మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని, ఈ విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం చిన్న పొరపాటు జరిగిందని సచిన్ అభిప్రాయపడ్డారు.
తర్వాతి కథనం
