శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Modified: బుధవారం, 10 జులై 2019 (16:36 IST)

టీమిండియా 5 ఓవర్లలో 6 పరుగులా? 10 ఓవర్లకి 4 వికెట్లు... ఎవరన్నా అనుకున్నారా?

ప్రపంచ కప్ మొదటి సెమీఫైనల్స్ లో భాగంగా భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే వర్షం కారణంగా నిన్న ముగియాల్సిన ఆట నేడు కూడా సాగుతోంది. భారత్ క్రీడాభిమానులకు షాక్ కొట్టే విషయం ఏంటంటే... 3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోవడం. ఆ తర్వాత 5 ఓవర్లకు 6 పరుగులు చేయడం. 10 ఓవర్లకి 4 వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేయడం.

ఇలా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కోహ్లి సేన సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలుస్తుందో లేదోనని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ ఉగ్గబట్టుకుని చూస్తున్నారు.
 
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి భారత్ స్కోరు కేవలం నాలుగు పరుగులు మాత్రమే. ఓపెనర్ రోహిత్ శర్మ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. 
 
కాగా, మాంచెష్టర్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ మంగళవారం ప్రారంభమైంది. అయితే, కివీస్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల వద్ద ఉండగా, వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వు డేకు వాయిదాపడింది. దీంతో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద నుంచి ఇన్నింగ్స్ ప్రారంభించింది. 
 
అయితే బుమ్రా బౌలింగ్‌లో రవీంద్ర జడేజా వేసిన త్రోకు టేలర్ (74) రనౌట్ అయ్యాడు. ఆ తర్వత భువనేశ్వర్ బౌలింగ్‌లో 12 పరుగులు చేసిన నీషమ్, హెన్రీ (1)లు ఔట్ అయ్యారు. అప్పటికి కివీస్ స్కోరు 49 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఆ తర్వాత నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 
 
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లో గుప్తిల్ 1, నికోల్స్ 28, విలియమ్సన్ 67, టేలర్ 74, నషీమ్ 12, గ్రాండ్‌హో 16, లాథమ్ 10, సంత్నెర్ 9, హెన్రీ 1, బోల్ట్ 3 చొప్పున పరుగులు చేశారు. ఆ తర్వాత 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. హెన్రీ వేసిన బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దీంతో భారత్ తన తొలి వికెట్‌ను నాలుగు పరుగుల వద్ద కోల్పోయింది.