మంగళవారం, 19 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (09:57 IST)

జెర్సీ రంగు మారడం వల్లే భారత్ ఓటమి : మెహబూబా ముఫ్తీ

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం బర్మింగ్‌హామ్ వేదికగా భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టుకు ఇదే తొలి ఓటమి. ఈ ఓటమిపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. భారత జట్టు జెర్సీ రంగు మారడం వల్లే ఓటమి పాలైందని అన్నారు. తనది మూఢనమ్మకమని అనుకున్నా తాను మాత్రం ఇదే చెబుతానని స్పష్టం చేశారు. 
 
అలాగే, భారత జట్టు ప్రదర్శనపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పెదవి విరిచారు. భారత బ్యాటింగ్ ఆసక్తి లేకుండా సాగిందన్నారు. మరింత బాగా ఆడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా, అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల మేరకు ఏ రెండు జట్లు ఒకే రంగు జెర్సీలను ధరించకూడదు. ఇంగ్లండ్ - భారత జట్ల జెర్సీలు రెండూ నీలమే కావడంతో భారత్ జట్టు జెర్సీని బీసీసీఐ మార్చింది. కాషాయం-నీలం రంగులతో సరికొత్త జెర్సీని తీసుకొచ్చింది. ఈ జెర్సీల్లో భారత క్రికెటర్లు కనిపించి, తొలి ఓటమిని మూటగట్టుకున్నారు.