వరల్డ్ కప్ : ఇంగ్లండ్ బ్యాటింగ్.. భారత జట్టులోకి రిషబ్ పంత్

rishab panth
Last Updated: ఆదివారం, 30 జూన్ 2019 (15:06 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్, భారత క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.

అయితే, ఈ మ్యాచ్ కోసం భారత్ ప్రకటించిన తుది జట్టులో ఒక మార్పు చేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విజయ్ శంకర్‌ను తొలగించి అతని స్థానంలో రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే, ఇంగ్లండ్ జట్టుల రెండు మార్పులు చేశారు.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ క్రికెటర్లు ఆరంజ్ జెర్సీలో కనిపించనున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు అపజయం అంటూ ఎరుగని జట్టుగా స్థానం సంపాదించుకుంది. ఈ మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్‌కు అత్యంత కీలకమైనదిగా మారింది.

ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
భారత జట్టు : కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జాదవ్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, షమీ, చాహల్, బుమ్రా.

ఇంగ్లండ్ జట్టు : జేజే రాయ్, బైర్‌స్టో, రూట్, మోర్గాన్, స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లుంకెట్, రషీద్, ఆర్చెర్, వుడ్.దీనిపై మరింత చదవండి :