శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : గురువారం, 11 జులై 2019 (12:18 IST)

కోట్ల మంది హృదయాలు భగ్నమయ్యాయి.. కానీ పోరాటం అద్భుతం (video)

ఐసీసీ క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
 
టీమిండియా ఓటమిపై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ స్పందించారు. టీమిండియా ఓటమికి వంద కోట్ల భారత హృదయాలు భగ్నమై ఉంటాయని, కానీ మ్యాచ్‌లో విజయం కోసం టీమిండియా పోరాడిన తీరు అమోఘమని కొనియాడారు. 
 
తమ ప్రేమాభిమానాలకు టీమిండియా అర్హురాలని పేర్కొన్నారు. మరోవైపు, సెమీస్ లో 18 పరుగుల తేడాతో భారత్ ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టుకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. బాగా ఆడి గెలిచారంటూ ప్రశంసించారు.