శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (14:25 IST)

పృథ్వీ షాతో పాటు స్నేహితులు నా ప్రైవేట్ భాగాలు తాకారు.. నటి

Sapna
ప్రముఖ క్రికెటర్ పృథ్వీ షా తన ప్రైవేట్ భాగాలను తాకాడని కామెంట్ చేసింది.. నటి సప్నా గిల్. ప్రస్తుతం సప్నా గిల్ కామెంట్స్ సంచలనానికి దారితీశాయి. 
 
పృథ్వీ షా భారత క్రికెట్ జట్టులో ప్రముఖ ఆటగాడు. ఇటీవల, పృథ్వీ షా ముంబైలోని స్టార్ హోటల్ శాంతాక్రూజ్‌లో స్నేహితులతో కలిసి భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇన్‌స్టా-సెలబ్రిటీ నటి స్వప్నా గిల్ సెల్ఫీ కోసం పృథ్వీ షాను సంప్రదించగా అతను నిరాకరించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో స్వప్న గిల్, ఆమె స్నేహితులు తన కారుపై దాడి చేసి ధ్వంసం చేశారని పృథ్వీషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీని ప్రకారం గత శనివారం స్వప్న గిల్, ఆమె స్నేహితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన స్వప్న గిల్ క్రికెటర్ పృథ్వీషాపై ఫిర్యాదు చేసింది. 
 
ఆ రోజు తమ తప్పేమీ లేదని, పృథ్వీ షాతో సెల్ఫీ దిగేందుకు వెళ్లలేదని చెప్పింది. తమ స్నేహితుల్లో ఒకరు పృథ్వీషాతో సెల్ఫీ దిగేందుకు వెళ్లారని, అతడిపై పృథ్వీ షా, అతని స్నేహితులు దాడి చేశారని చెప్పింది. అంతేగాకుండా పృథ్వీషా- ఆయన స్నేహితులు మద్యం మత్తులో తన ప్రైవేట్ భాగాలను తాకారని దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కలకలం రేపుతోంది.