ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (09:19 IST)

పృథ్వీ షాను సప్నాగిల్ వదలదా? ఆయనే రెచ్చగొట్టాడట!

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై నటి సప్నా గిల్ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. టీమిండియా స్టార్ ప్లేయర్ పృథ్వీ షా సోషల్ మీడియా మాంచి క్రేజున్న సప్నా గిల్‌ మధ్య గత వారంలో వివాదం నెలకొంది. 
 
పృథ్వీ షాపై సప్నా గిల్‌తో పాటు ఆమె స్నేహితులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వున్నాయి. ఈ కేసులో సప్నా గిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బెయిలుపై వచ్చిన వెంటనే సప్నా గిల్ పృథ్వీ షాపై కేసు పెట్టింది. అతడి స్నేహితుడు ఆశిష్ యాదవ్‌పై సప్నా గిల్ తాజాగా ముంబై ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కాగా ముంబైలోని ఓ హోటల్‌లో గిల్ భోజనం చేస్తున్న సమయంలో సెల్ఫీ తీసుకునే విషయంలో సప్నా, గిల్ మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఆశిష్ కారుపై సప్నాగిల్, ఆమె స్నేహితులు దాడి చేశారని ఆరోపణలు వున్నాయి. అయితే, పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టినట్టు సప్నా ఆరోపిస్తున్నారు.