శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (23:09 IST)

పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఎప్పటికీ ఆకర్షించలేను.. సానియా-షోయబ్‌లు కలిసుంటారా? (video)

Ayesha Omar-Shoaib Malik
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చాట్ షోలో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల పుకార్ల గురించి అడిగిన ప్రశ్నకు "పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఎప్పటికీ ఆకర్షించలేను" అని పాకిస్థాన్ నటి అయేషా ఒమర్ చెప్పింది. షోయబ్‌తో తన 'రివీలింగ్' ఫోటోషూట్ 'పాకిస్తాన్‌లో కాకుండా భారతదేశంలో వివాదంగా మారింది' అని ఆమె తెలిపింది.
 
2021 ఫోటోషూట్‌లో ఇద్దరూ కలిసి కనిపించినప్పటి నుండి ఆయేషా పేరు షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారంలో ముడిపడివుంది. గత ఏడాది ఫోటోషూట్ నుండి షోయబ్-ఆయేషా చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. 
 
షోయబ్ ఆయేషాను పెళ్లి చేసుకుంటాడనే పుకార్లు కూడా వచ్చాయి. గత సంవత్సరం పాకిస్తానీ నటుడు దానిని ఖండించాడు. షోయబ్- సానియా 2010లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి దుబాయ్‌లో ఉంటున్నారు. ఈ దంపతులకు ఇజాన్‌ అనే కుమారుడు వున్నాడు.