శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (15:07 IST)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెంటార్‌గా సానియా మీర్జా

sania mirza
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2023లో ఆడే  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)టీమ్ మెంటార్‌గా భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా ఎంపికైంది. 
 
తన టెన్నిస్ కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన మీర్జా, 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన చివరి మేజర్ టోర్నమెంట్ ఆడింది. ఆమె, రోహన్ బోపన్నతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది.
 
ఈ నేపథ్యంలో ఆర్సీబీ మహిళల జట్టు మెంటార్‌గా ఎన్నికైన సందర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ..  "నేను ఆర్సీబీ మహిళల జట్టులో మెంటార్‌గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో భారత మహిళల క్రికెట్ కొత్త మార్పును చూసింది. 
 
ఈ విప్లవాత్మక పిచ్‌లో భాగం కావాలని నేను నిజంగా ఎదురు చూస్తున్నాను. ఆర్సీబీ, దాని బ్రాండ్ కోసం పూర్తి విశ్వాసంతో పనిచేస్తాను. నా పదవీ విరమణ తర్వాత క్రీడలకు ఎంతగానో దోహదపడతాను.." అంటూ చెప్పుకొచ్చింది.