1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
  4. i have enjoyed is watching india play brett lee

పాక్‌పై ఆ విజయం పరిపూర్ణ విజయం.. టీమిండియాను ఆకాశానికెత్తేసిన బ్రెట్‌లీ

గత కొంతకాలంగా భారత క్రికెట్ చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ. అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా చాలా మంచి క్రికెట్ ఆడుతుందంటూ కితాబిచ్చాడు. చాంపియన్స్

Brett Lee
గత కొంతకాలంగా భారత క్రికెట్  చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ. అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా చాలా మంచి క్రికెట్ ఆడుతుందంటూ కితాబిచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో  డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగి భారత జట్టుకే మరొకసారి టైటిల్‌ను గెలిచే సత్తా ఉందన్నాడు.
 
'చాలాకాలంగా భారత క్రికెట్ మంచి ఫలితాలు సాధిస్తోంది. ఇప్పుడు ఆ జట్టు చాలా పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగుల్లో సమతుల్యతను కల్గి ఉంది. మంచి క్రికెట్ ఆడుతున్న భారత క్రికెట్‌ను చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నా. చాంపియన్స్ ట్రోఫీని గెలిచే అవకాశాలు భారత్‌కే ఉన్నాయి. కాకపోతే ఆస్ట్రేలియా టైటిల్‌ను సాధించాలని కోరుకుంటున్నా' అని బ్రెట్ లీ తెలిపాడు.
 
గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించడాన్ని బ్రెట్ లీ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. పాక్ పై భారత్ సాధించిన విజయం నిజంగా అద్భుతమని కొనియాడాడు. అదొక పరిపూర్ణ విజయంగా బ్రెట్ లీ అభివర్ణించాడు.
 
About Writer
Raju
తర్వాతి కథనం
కోహ్లీ మాట అశ్విన్ వినడం లేదా.. అందుకే పక్కన బెట్టారా? ఇద్దరికీ ఎక్కడ బెడిసింది?