ఆ బీమర్లు, యార్కర్లు అంటేనే దడుచుకునేవాడిని.. షోయబ్ ముందు తలవంచిన ధోనీ
తన పదమూడేళ్ల క్రికెట్ కెరీర్లో పాకిస్తానీ ఫేస్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ అంటేనే భయపడేవాడినని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెల్లడించాడు. ఎంతోమంది గ్రేటెస్ట్ బౌలర్లను సునాయసంగా సమర్ధవంతంగా ఎదుర్కొన్న ధోని.. పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్
తన పదమూడేళ్ల క్రికెట్ కెరీర్లో పాకిస్తానీ ఫేస్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ అంటేనే భయపడేవాడినని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెల్లడించాడు. ఎంతోమంది గ్రేటెస్ట్ బౌలర్లను సునాయసంగా సమర్ధవంతంగా ఎదుర్కొన్న ధోని.. పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు ఎక్కువగా భయపడేవాడినని చెప్పడం గమనార్హం. తన క్రికెటె కెరీర్ లో చాలా సందర్భాల్లో పేస్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడిన మాట నిజమేనని ధోని స్పష్టం చేశాడు. కొన్ని సందర్భాల్లో అక్తర్ వేసే బీమర్లు అసలు అర్థమయ్యేవే కావని ధోనీ చెప్పడం విశేషం.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లండన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో ధోని ఈ విషయాన్ని పేర్కొన్నాడు. 'మీ కెరీర్లో అత్యంత కఠినమైన బౌలర్ ఎవరు' అనే ప్రశ్నకు అక్తర్ అని ధోని సమాధానమిచ్చాడు. తాను చాలామంది కఠినమైన బౌలర్లను ఎదుర్కొన్నప్పటికీ, అక్తర్ బౌలింగ్ మాత్రం ప్రత్యేకమని ధోని తెలిపాడు. అందుకు ఒక సింపుల్ రీజన్ చెప్పుకొచ్చాడు మన మిస్టర్ కూల్. 'అతనొక వేగవంతమైన బౌలర్. ఊహించని విధంగా బంతులు సంధిస్తుంటాడు. యార్కర్లను చాకచక్యంగా వేయగలడు. దాంతో పాటు బౌన్సర్లను సైతం సమర్దవంతంగా సంధించగలడు. కొన్ని సందర్బాల్లో అతను వేసే బీమర్లు అస్సలే అర్దంకావు. నా కెరీర్ లో ఎదురైన కఠినమైన బౌలర్ అక్తర్'అని ధోని తెలిపాడు.
తన భీకరమైన బాదుడుతో ప్రపంచ స్థాయి బౌలర్ల బంతులను అవలీలగా మైదానం అవతలకి పంపే బ్యాంటింగ్ శైలి ధోనీ సొంతం. తన కెరీర్లో బ్రెట్‌లీ, గ్లెన్ మెగ్రాత్, లసిత్ మలింగా, డేల్ స్టెయిన్ వంటి క్రికెట్ క్రీడను శాసించిన మేటి బౌలర్లను ధోనీ ఎదుర్కొన్నాడు. కాని పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ అంటేనే తనకు చమటలు పట్టేవని ధోనీ చెప్పాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆడటమంటేనే కష్టం. నాకున్న టెక్నిక్ పరిమితమైంది. దీంతో ఫాస్ట్ బౌలర్లను ఫేస్ చేయడం చాలా కష్టమయ్యేది. నేనెదుర్కొన్న వారిలో అత్యుత్తమ బౌలర్, నన్ను భయపెట్టిన బౌలర్ ఎవరంటే షోయబ్ అక్తర్ అనే చెబుతానన ధోనీ పేర్కొన్నాడు.
పాకిస్తాన్‌తో 32 వన్డేలు ఆడిన ధోనీ 58.38 సగటుతో 1226 పరుగులు చేశాడు. దాయాది దేశంపై పోటీలో రెండు సెంచరీలు, 9 అర్థ సెంచరీలు సాధించాడు. 2005లో కోచిలో పాక్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 3 పరుగులకే ఔటైన ధోనీ తర్వాత విశాఖలో జరిగిన రెండో మ్యాచ్‌లో పాక్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ 123 బంతుల్లో 148 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.
ఒక జులపాల జుట్టు బ్యాట్స్‌మన్ పాక్‌ను ఉతికి ఆరేశాడంటూ అభిమానులు చాలాకాలం చెప్పుకున్నారు. పాక్ జట్టుపై ఆ భీకర దాడే ధోనీ అనే ఒక అనామకుడిని ఇంత స్థాయిలో నిలిపింది.