Taapsee Pannu: కొన్ని కథలు సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయ్.. అందుకే రిటైర్ మెంట్ బెటర్ : తాప్సీ
Taapsee Pannu;
తాజాగా తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి' ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దేవాశిష్ మఖీజా దర్శకత్వంలో, కనికా థిల్లాన్ నిర్మించారు. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ తన బిడ్డ కోసం పోరాడే పవర్‌ఫుల్ తల్లి పాత్రలో తాప్సీ కనిపించారు. ఇష్వాక్ సింగ్, జతిన్ సర్నా, స్వస్తికా ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విడుదలై మంచి స్పందన పొందుతున్న తరుణంలో.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ ఇండస్ట్రీ ధోరణులపై నిరాశవ్యక్తం చేశారు.
కొన్ని రకాల సినిమాలు, మార్కెట్ ధోరణిలను చూస్తుంటే తనకు నటనకు స్వస్తి చెప్పాలనే ఆలోచన వచ్చింది. నాణ్యత, ప్రమాణాలు తగ్గించుకుని సినిమాలు చేయాల్సిన పరిస్థితి వస్తే, రిటైర్ అవ్వడమే ఇష్టమని తేల్చి చెప్పారు. గత కొన్ని నెలలుగా థియేటర్లలోకి వస్తున్న చిత్రాల తీరును గమనించి, "నా రిటైర్మెంట్ సమయం దగ్గరపడిందేమో" అని తన కుటుంబ సభ్యులతో కూడా సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలిపారు.
