కొడుకుతో కలిసి భర్త గొంతుకోసిన మూడో భార్య!
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. కుమారుడుతో కలిసి మూడో భార్య తన భర్త గొంతుకోసింది. చున్నీతో కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి గొంతుకోశారు. బండ్లగూడ రాణా పరిధిలో మంగళవారం ఉదయం ఈ హత్య జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం,
బంజారాహిల్స్‌కు చెందిన మసీయుద్దీన్ (57) అనే రియల్టర్ కొన్నేళ్ల క్రితం షబానా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. మసీయుద్దీన్‌కు ఇది మూడో పెళ్లి కాగా, షబానాకు రెండో విషయం. షబానాకు అప్పటికే సమీర్ అనే కొడుకు ఉన్నాడు. బండ్లగూడలోని క్రిస్టల్ టౌన్‌షిప్‌లో మసీయుద్దీన్ అపార్టుమెంట్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న షబానాను, ఆమె కొడుకును అక్కడ ఉంచాడు. మసీయుద్దీన్ రోజూ వచ్చి వెళుతుండేవాడు.
ఈ క్రమంలో సోమవారం మసీయుద్దీన్, షబానాకు మధ్య గొడవ పడింది. మంగళవారం ఉదయం మసీయుద్ధీన్ అపార్టుమెంట్‌కు వచ్చాడు. అప్పటికే అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న షబానా, సమీర్‌తో పాటు అతడి స్నేహితుడు ఫరీద్ సాయంతో మసీయుద్దీన్‌పై దాడి చేసింది.
చున్నీతో మసీయుద్దీన్ చేతులు, కాళ్లు కట్టేసింది. మసీయుద్ధీన్ అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆపై గొంతుకోసి హతమార్చారు. మంగళవారం రాత్రి బండ్లగూడ ఠాణాకు పెళ్లి షబానా, సమీర్‌లు పోలీసుల ముందు లొంగిపోయారు. హత్యకు కారణాలేంటనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు. అయితే, షబానాకున్న వివాహేతర సంబంధమే మసీయుద్దీన్ దారితీసిందని తెలుస్తుంది.