శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (13:59 IST)

మైఖేల్ జాక్సన్ నుంచి ఆర్తీ అగర్వాల్, శ్రీదేవి దాకా... అదే కారణమా?

సినీ ఇండస్ట్రీ అంటే వేరే చెప్పక్కర్లేదు. కేవలం గ్లామర్ కోసమే ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడని ఎందరో. తమ అభిమానుల కోసం ఎల్లప్పుడూ అందంగా వుండేందుకు తహతహలాడుతుంటారు సినీ సెలబ్రిటీలు. ఈ జాగ్రత్తలే వారి మరణాలకు దారి తీస్తుంటాయన్న విషయం ఇప్పటికే చాలామంద

సినీ ఇండస్ట్రీ అంటే వేరే చెప్పక్కర్లేదు. కేవలం గ్లామర్ కోసమే ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడని ఎందరో. తమ అభిమానుల కోసం ఎల్లప్పుడూ అందంగా వుండేందుకు తహతహలాడుతుంటారు సినీ సెలబ్రిటీలు. ఈ జాగ్రత్తలే వారి మరణాలకు దారి తీస్తుంటాయన్న విషయం ఇప్పటికే చాలామంది విషయంలో జరిగింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్, టాలీవుడ్ దాకా చాలామంది తమ గ్లామర్ అందాలను మెరుగుపరుచుకునేందుకు రకరకాల సర్జరీలు చేయించుకుంటూ వుంటారు. 
 
ఇలాంటి సర్జరీలు వారి ప్రాణాలను తీస్తున్నాయి. అందాన్ని మెరుగుపరుచుకునే సర్జరీలు అడ్వాన్సుగా లేని రోజుల్లోనే మైఖేల్ జాక్సన్ ఏడాకి 10 నుంచి 15 శస్త్రచికిత్సలు చేయించుకనేవారు. అలా శస్త్ర చికిత్సలు తీసుకుంటూనే వికటించి ఆయన మృత్యువాత పడ్డారు. ఇక ఆర్తీ అగర్వాల్ కూడా శస్త్ర చికిత్స తీసుకున్న సమయంలో తీవ్రమైన గుండెపోటు వచ్చి చనిపోయారు. శ్రీదేవి విషయంలోనూ ఇదే జరిగిందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ఎప్పుడంటే అప్పుడు సన్నబడే శరీర తత్వం తనదని చెప్పుకునే శ్రీదేవి అప్పుడప్పుడు ఇలాంటి సర్జరీలు ఆశ్రయిస్తుండేవారని చెపుతున్నారు. ఐతే వయసు పైబడిని ఈ సమయంలో ఆమె ఇలాంటి సర్జరీని ఆశ్రయించడం వల్ల తేడా వచ్చి ప్రాణాలను కోల్పోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులు మాత్రం ఇప్పటివరకూ రూఢిగా బయటకు రావడంలేదు. చూస్తుంటే శ్రీదేవి మరణం కూడా మరో జయలలిత మిస్టరీ డెత్‌లా మారిపోయేట్లుగా వుంది.