శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2017 (17:44 IST)

జగన్ కేసుపై తీర్పు.. రాజకీయాల్లోకి భారతి.. చెల్లెలు షర్మిల కూడా సీన్లోకి వస్తారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి రాజకీయాల్లో రానున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. భారతిని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చే దిశగా రంగం సిద్ధమవుతుందని తెలుగు టీవీలు కోడ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి రాజకీయాల్లో రానున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. భారతిని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చే దిశగా రంగం సిద్ధమవుతుందని తెలుగు టీవీలు కోడైకూస్తున్నాయి. ఇప్పటికే జగన్ చెల్లెమ్మ షర్మిల రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఓటర్లను తనవైపు తిప్పుకుంది.

కానీ అన్నయ్య జైలు నుంచి రాగానే ఈమె కాస్త కనుమరుగైంది. ప్రస్తుతం జగన్ భార్య రాజకీయాల్లోకి వచ్చినా.. జగన్ ఎంత వరకు ఆమెను రంగంలోకి దించుతారు. ఎలాంటి పదవులు ఇస్తారు. లేకుంటే చెల్లెలు తరహాలో ఉపయోగించుకున్నంతవరకు యూజ్ చేసుకుని ఆపై ఇంటికే పరిమితం చేస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది.
 
అయితే జగన్ సతీమణి భార్య భారతికి మాత్రం షర్మిలకు ఏర్పడిన దుస్థితి ఏర్పడదని రాజకీయ పండితులు అంటున్నారు. వైకాపా ప్రచారకర్తగా ఆమె వ్యవహరించినా.. ఆమె అన్నయ్య వుండగా టీవీల ముందు ఏమాత్రం కనిపించదని వారు చెప్తున్నారు. ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లో ఉన్నారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్. విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేసి పరాజయం పాలైంది. 
 
ఇక రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల వైఎస్సార్సీపీ ప్రచారకర్తగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు (ఏప్రిల్ 28న) ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా వచ్చినా, పార్టీని నడిపించే బాధ్యతను వైఎస్. భారతి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా, వైఎస్.భారతి సాక్షి పత్రికను నడిపే బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో పార్టీని నడిపే బాధ్యతలు కూడా భారతికి అప్పగించాలని జగన్ భావిస్తున్నారు. 
 
ఇప్పటికే అక్రమాస్తుల కేసులో వైకాపా చీఫ్ జగన్ బెయిల్ రద్దు చేయాలనే సీబీఐ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. నిందితుడు సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని సీబీఐ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. మే 15 నుంచి జూన్ 15 మధ్య న్యూజిలాండ్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
వేసవి సెలవుల నిమిత్తం కుటుంబంతో కలిసి వెళ్లాలని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం తెలిపింది. సీబీఐ వాదనలు విన్న కోర్టు కేసు తీర్పును ఈ నెల 28కి వాయిదా వేసింది. దీనిపై 28న తీర్పు రానుంది.