బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By selvi
Last Updated : బుధవారం, 7 జూన్ 2017 (12:50 IST)

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. పవన్‌తో పొత్తుకు జగన్ ప్లాన్.. మహాకూటమి ఏర్పాటవుతుందా?

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని.. అందుకోసం అందుబాటులో ఉండే ఏ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకునేందుకు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోయారు. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని.. అందుకోసం అందుబాటులో ఉండే ఏ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకునేందుకు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోయారు. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి పవన్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌‍తో చేతులు కలిపేందుకు  సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళాలని భావిస్తున్న జగన్.. పవన్‌తో చర్చలకు కూడా రంగం సిద్ధం చేశారు. జనసేనానితో చర్చలు జరిగే బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ కాపు నేతకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. 
 
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై తన నేతలతో చర్చించిన జగన్.. 2019లో ఎన్నికల్లో గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పవన్‌తో కలిసి నడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వామపక్ష పార్టీలు ప్రకటించిన తరుణంలో పవన్‌తో జత కడితే సీపీఐ, సీపీఎంలు కూడా కలిసి వచ్చినట్టేనని ప్లాన్ వేస్తున్నారు. 
 
ఇక ఒంటరిగా వున్న కాంగ్రెస్‌ను కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేసి.. తద్వారా తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నికల్లో ఓడించాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి జగన్ ఆలోచనకు పవన్ మద్దతిస్తారా.. వైకాపాతో జనసేన పొత్తుపెట్టుకుంటుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.