శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: సోమవారం, 2 జనవరి 2017 (18:19 IST)

శశికళ సీఎం పోస్టుకు అడ్డుపడుతున్న తమిళ 'సూరీడు'... 2017 స్టాలిన్‌దేనా?

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకె పార్టీలో వరసబెట్టి చోటుచేసుకున్న మార్పులు చూస్తూనే ఉన్నాం. జయ నెచ్చెలి శశికళ ఎలాంటి అడ్డంకి లేకుండా స్మూత్‌గా పార్టీ పగ్గాలు పట్టేసారు. అమ్మ కారులో కూడా తిరిగేస్తున్నారు. కట్టూ బొట్టూ అచ్చు అమ్మలా మారిపోతున్నారు చిన్నమ్

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకె పార్టీలో వరసబెట్టి చోటుచేసుకున్న మార్పులు చూస్తూనే ఉన్నాం. జయ నెచ్చెలి శశికళ ఎలాంటి అడ్డంకి లేకుండా స్మూత్‌గా పార్టీ పగ్గాలు పట్టేసారు. అమ్మ కారులో కూడా తిరిగేస్తున్నారు. కట్టూ బొట్టూ అచ్చు అమ్మలా మారిపోతున్నారు చిన్నమ్మ. చిన్నమ్మ పట్ల కొందరు మంత్రులు భక్తులుగా మారిపోతున్నారు. చిన్నమ్మ ముఖ్యమంత్రి కావాలంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. మరీ ఇంత బహిరంగా... పన్నీర్ సెల్వం మంత్రులు మాట్లాడుతుంటే ఆయన మాత్రం ఆ పదవిలో ఎంతకాలం కొనసాగగలుగుతారు. కనుక సాధ్యమైనంత త్వరలో తదుపరి ముఖ్యమంత్రి పీఠాన్ని శశికళ అధిష్టించడమే ఆలస్యం.
 
ఈ నేపధ్యంలో తమిళనాడు సూరీడు... అదేనండీ డీఎంకే పార్టీ రంగంలోకి దిగింది. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సూచన చేసింది. వ్యవహారం చూస్తుంటే అనుకున్నట్లే ఆ 20 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభను సమావేశపరిచి బల నిరూపణకు సిద్ధం కావాలని కోరింది. పన్నీర్ సెల్వం అయితే ఓకే కానీ శశికళ సీఎం పగ్గాలు చేపడుతారంటే తాము చూస్తూ కూర్చోబోమని డీఎంకే నేతలు అంటున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే 2017 ఇక స్టాలిన్‌దేనని అనుకోవచ్చన్నమాట. అంతేమరి... కాసేవాడు పోతే మేసేవి ఎటుబడితే అటు పోతాయి. అలా అవుతుందన్నమాట అన్నాడీఎంకె పరిస్థితి.