శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : బుధవారం, 9 నవంబరు 2016 (14:36 IST)

నల్ల కుబేరులకు వాతపెట్టిన మోడీ: గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పెళ్లి ఎలా? చుక్కలు కనిపిస్తున్నాయా?

బ్లాక్ మనీపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్ల కుబేరులకు ముచ్చెమటలు పట్టాయి. ప్రధాని మోడీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి రూ. 500, రూ.1,000 నోట్లు చెల్లవని ప

బ్లాక్ మనీపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్ల కుబేరులకు ముచ్చెమటలు పట్టాయి. ప్రధాని మోడీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి రూ. 500, రూ.1,000 నోట్లు చెల్లవని ప్రకటించిన అనంతరం.. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తలపట్టుకుని కూర్చున్నట్లు తెలిసింది. గాలి కుమార్తె బ్రహ్మిణి వివాహం ఈ నెల 16వ తేదీన బెంగళూరు నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
 
కాగా అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తులు కూడబెట్టుకుని.. అక్రమంగా మైనింగ్ ద్వారా వ్యాపారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి.. కూతురు పెళ్ళి ఎలా చేస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. గాలి తన కుమార్తె బ్రహ్మిణి వివాహ శుభలేఖలే సరికొత్త టెక్నాలజీతో తయారు చేయించి భారతదేశంలోని ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు. శుభలేఖలే ఇంత గ్రాండ్‌గా ఉంటే.. ఇక పెళ్ళి ఏ రేంజులో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ మోడీ నిర్ణయంతో గాలికి చుక్కలు కనిపిస్తున్నాయి. 
 
సెప్టెంబర్ 30వ తేదికి ఇన్ కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ స్కీమ్ ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగా లెక్కలు చూపించడానికి ప్రయత్నించినా అది బ్లాక్ మని లెక్కకిందకు వస్తుంది. అయితే గాలి జనార్థన్ రెడ్డి తన అనుచరుల సహాయంతో తన కుమార్తె వివాహం ముందుగా అనుకున్నట్లు ఘనంగా చేస్తారని సమాచారం. సన్నిహితుల దగ్గర రుణం కింద డబ్బు తీసుకుని దానిని తిరిగి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. కాగా గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి విచ్చేసే అతిథుల జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు కూడా ఉండటం గమనార్హం.