శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (18:33 IST)

డబుల్ గేమ్ శశికళ...?! మంగళవారం నాడు పటాపంచలు... ఎలాగంటే?

అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ డబుల్ గేమ్ ఆడుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పన్నీరు సెల్వంకు గంటగంటకూ మద్దతు పెరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోక శశికళ డబుల్ గేమ్ ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు సిఎం పీఠ

అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ డబుల్ గేమ్ ఆడుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పన్నీరు సెల్వంకు గంటగంటకూ మద్దతు పెరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోక శశికళ డబుల్ గేమ్ ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు సిఎం పీఠం కోసం బలనిరూపణకు సిద్ధమైన శశికళకు ఒక్కసారిగా పన్నీరు సెల్వం ఝలక్ ఇస్తూ వస్తుండటంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కారణం పన్నీరు సెల్వంకు మద్ధతు తెలిపే ఎమ్మెల్యేలు పెరగడమేనంటున్నారు విశ్లేషకులు. 
 
సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి హడావిడిగా ఏర్పాట్లు చేసేసుకున్నారు శశికళ. అయితే కేంద్రం నుంచి శశికళకు అడ్డురావడంతో ఇక చేసేది లేక గవర్నరుకు వినతులు సమర్పించడం, ఆ తరువాత ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఇలా.. ఒకటి కాదు.. శశికళ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ శశికళ కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు.
 
ఒక్కో వైపు నుంచి ఒక్కో గండం వస్తుండడంతో ఇక చేసేది లేక సిఎం పదవే వద్దనుకుని చివరకు పార్టీలో సీనియర్ నేతగా ఉన్న సెంగోడియన్‌ను సిఎం అభ్యర్థిగా నిలబెట్టాలని శశికళ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని నిన్న ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇంతలో సెంగోడియన్ లేచి నాకు ఆ పదవి వద్దు. మీరు ఒక్కరే ఆ పదవి అర్హులు అంటూ ఆయన కూర్చున్నారు. ఇక సమావేశంలో నుంచి అమ్మ వాలుగ(వర్థిల్లాలి) అలాంటి నినాదాలు వినిపించాయి.
 
ఇదంతా మొత్తం డ్రామా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం అందరి భావనలోనూ సిఎం పీఠం కోసం శశికళ వెంపర్లాడుతున్నారన్నదే. ఆ భావన పోగొట్టేందుకు ఆమె అలా డ్రామా ప్లే చేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తనకు సిఎం పీఠం వద్దంటే సానుభూతి మరింత పెరిగి.. ఆమెకు ఎమ్మెల్యేల నుంచే కాదు పార్టీ నేతల నుంచి సపోర్ట్ ఉంటుందన్న కోణంలో ఆలోచించారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. 
 
కేవలం 3వ తరగతి చదివి, వీడియోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించి.. ఆ తరువాత జయలలిత ఏర్పడిన పరిచయంతో అన్నాడిఎంకేలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుని రాజకీయ ఎత్తుగడలతో సిఎం కావాలనుకుంటున్న శశికళను రాజకీయ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. కేవలం సర్పంచ్‌గా కూడా అనుభవం లేని శశికళ క్యాంప్ రాజకీయాలతో పాటు.. తమిళ రాజకీయాలను శాసించే తీరు చూస్తే నోరెళ్ళపెట్టక తప్పదంటున్నారు. ఐతే మంగళవారం నాడు... అంటే రేపు ఉదయం శశికళ అక్రమాస్తులకు సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టు ముందుకు రానుంది. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వెయిట్ అండ్ సీ.