శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: శుక్రవారం, 14 అక్టోబరు 2016 (15:17 IST)

పెట్రోల్ బంకుల వ‌ద్ద సెల్ ఫోన్ వాడ‌కూడ‌దా? ఎందుక‌ని?

విజ‌య‌వాడ ‌: పెట్రోల్ బంకుల వద్ద సెల్‌ఫోన్‌లు వాడకూడదనే హెచ్చరిక బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. ఎందుకని సెల్ ఫోన్ మాట్లాడితే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయా? ఫోన్ వ‌ల్ల పెట్రోల్ బంకుల్లో ప్రమాదాలు జరిగిన ఘటనలున్నాయా? ఒకటీ రెండు ప్రమాదాలు జరిగినా సెల్‌ఫ

విజ‌య‌వాడ ‌:  పెట్రోల్ బంకుల వద్ద సెల్‌ఫోన్‌లు వాడకూడదనే హెచ్చరిక బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. ఎందుకని సెల్ ఫోన్ మాట్లాడితే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయా? ఫోన్ వ‌ల్ల పెట్రోల్ బంకుల్లో ప్రమాదాలు జరిగిన ఘటనలున్నాయా? ఒకటీ రెండు ప్రమాదాలు జరిగినా సెల్‌ఫోన్‌ ఎంతవరకు కారణమనేది స్ఫష్టత లేదు. అయితే చిన్న రాపిడికి సైతం మండే గుణం పెట్రోల్, డీజిల్‌కు ఉంటుంది. అందుకేనేమో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఈ తరహా హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. 
 
సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే తరంగాలు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ హైఎనర్జీని క్యారీ చేస్తాయి. చిన్న రాపిడికి సైతం స్పందించగల పెట్రోల్‌ను సెల్‌ఫోన్ ద్వారా వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ ప్రభావితం చేయగలదని నిపుణులు భావిస్తున్నారు.
 
* మొబైల్ ఫోన్లు బ్లాస్ట్ కావడానికి బ్యాటరీయే ప్రధాన కారణం. ఉబ్బిన లేదా దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడటం చాలా ప్రమాదకరం. ఇవి ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉంటుంది కాబట్టి పెట్రోల్ బంకుల్లోకి వీటిని తీసుకెళ్లకూడదు.
* మొబైల్ ఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రభావం మెదడును తాకే అవకాశముంది. కాబట్టి మొబైల్ ఫోన్‌‍ను అపరిమితంగా ఉపయోగించటం మంచిది కాదు.
* మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు దారితీస్తుందా అనే అంశానికి సంబంధించి బలమైన రుజువులు ఇప్పటికైతే దొరకలేదు. ఇంకా పరిశోధనులు జరుగుతూనే ఉన్నాయి. ఏమైనా సెల్ ఫోన్లను అవసరం మేరకే వినియోగించడం మంచిది. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలి.
* సెల్‌ఫోన్‌లను ప్యాంట్ జేబుల్లో పెట్టుకోవడం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గి ఆ ప్రభావం మగతనంపై తీవ్రంగా చూపే అవకాశముందని పలు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.