సంబంధిత వార్తలు
- 'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?
- సీఎం విజయ్ సంచలన నిర్ణయం : ఆ టాస్మాక్ దుకాణాల మూసివేతకు ఆదేశం
- తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్
- రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రంలో త్రిష కృష్ణన్?
- ఇన్‌స్టాగ్రామ్‌తో బాగా సంపాదిస్తున్న విష్ణుప్రియ భీమినేని - రూ.40 లక్షలు
తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?
కోలీవుడ్ సినీ వర్గాల్లో ఇప్పుడొక టాక్ నడుస్తోంది. అదేమిటంటే... ఇటీవలే టీవీకే పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి సీఎం అయిన విజయ్‌కు తన పిల్లలంటే పెద్దగా పట్టించుకోడనే చర్చ నడుస్తోంది. సీఎం విజయ్ కుమారుడు జాసన్ హీరోగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. సందీప్ కిషన్‌తో సిగ్మా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
అసలు విషయం ఏంటంటే... జాసన్ సినిమా కెరీర్ సంగతిని విజయ్ అస్సలు పట్టించుకోలేదట. అంతేకాదు... జాసన్ కు వచ్చినటువంటి మొదటి సినీ అవకాశం కూడా అతడి తల్లి సంగీత, తాతయ్య ద్వారా వచ్చినట్లు సమాచారం. కుమారుడి సినిమా ప్రారంభం పూజా కార్యక్రమాలకు కూడా విజయ్ హాజరు కాలేదు. మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటపుడు కూడా కనీసం పిల్లలు కూడా హాజరు కాలేదు. దీనిపై సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు నడుస్తున్నాయి.
