1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. No one can replace a mother : Yogi Adityanath remembers his mother

సన్యాసం స్వీకరించాక తొలి భిక్ష అమ్మ నుంచే స్వీకరించాను : యోగి ఆదిత్యనాథ్

yogi adityanath
తాను సన్యాసం స్వీకరించిన తర్వాత మూడేళ్ల తర్వాత తన గ్రామానికి వెళ్లి భిక్ష స్వీకరించినట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. యోగి తల్లి సావిత్రి దేవి ఈ నెల 20వ తేదీన ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా తన తల్లితో గడిపిన కొన్ని క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన యోగి కీ పాటీ పేరుతో ఓ లేఖ రాశారు. అందులే తన తల్లి ప్రేమ గొప్పతనాన్ని వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. 
 
సన్యాసం స్వీకరించిన మూడేళ్ల తర్వాత ఉత్తరాఖండ్‌లోని తన స్వగ్రామంకు వెళ్లినట్లు యోగి పేర్కొన్నారు. కాషాయ వస్త్రాలలో ఇంటి ముందు నిలబడి భిక్ష అడిగానని తెలిపారు. ఆ గొంతు విని బయటకు వచ్చిన తల్లి.. కాషాయ వస్త్రాల్లో ఉన్న తనని చూసి నమ్మలేకపోయిందని చెప్పారు. 
 
అప్పుడే తాను తల్లితో.. 'అమ్మా.. నాకు భిక్ష పెట్టు' అని అడిగినట్లు పేర్కొన్నారు. ఆమె ఆశ్చర్యంగా.. 'ఎందుకు సన్యాసం తీసుకున్నావు.. ఇంట్లో ఏమైనా కొరత ఉందా' అని ప్రశ్నించారట. దానికి స్పందిస్తూ.. 'అమ్మా.. సన్యాసం నా ధర్మం. యోగి ఆకలి భిక్షతోనే తీరుతుంది. నేను ఇక్కడ ఉండటానికి రాలేదు. భిక్ష అడగడానికి వచ్చాను' అని చెప్పినట్లు తన లేఖలో రాసుకొచ్చారు. చివరకు తల్లి తన నిర్ణయాన్ని గౌరవించిందని గుర్తుచేసుకున్నారు.
 
ఈ సందర్భంగా రాముడు వనవాసానికి వెళ్లే సమయంలో తల్లి కౌసల్య ఆశీర్వదించిన ఘట్టాన్ని, కృష్ణుడు మథుర నుంచి గోకులానికి వెళ్లిన సందర్భాన్ని కూడా ప్రస్తావించారు. 'అమ్మ అందరి స్థానాన్ని భర్తీ చేయగలదు. కానీ, అమ్మ స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు' అంటూ తల్లి గొప్పతనాన్ని కొనియాడారు. 
 
తనకు అక్షర జ్ఞానం నేర్పిన తొలి గురువు తల్లేనని, జీవితంలో కొన్ని రుణాలను ఎప్పటికీ తీర్చలేమన్నారు. అయితే మహిళలు, తల్లుల పట్ల మన బాధ్యతలను మాత్రం నెరవేర్చగలమని తెలిపారు. అనాథలుగా, నిరాశ్రయులుగా మిగిలిన తల్లులకు అండగా నిలవాలని, కష్టాల్లో ఉన్న మహిళల బాధలను అర్థం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
లైంగిక వేధింపుల కేసు : వయోలిన్ విద్వాంసుడు అరెస్టు... గాయని చిన్మయి ఏమంటున్నారు?