బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (17:16 IST)

రోజూ మూడు ఖర్జూరాలు తింటే..

రోజూ మూడు ఖర్జూరాలు తింటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే శరీర అవయవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయం పనితీరు మెరుగవుతుంది. పక్షవాతం, కొవ్వు వంటి వాటిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఖర్జూరాల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. అది కండ్లకలక రాకుండా ఆరోగ్యాన్నిస్తుంది. 
 
అలాగే ఖర్జూరాల్లో వుండే లూటిన్, జియాసాంటైన్ వంటివి కూడా దృష్టి శక్తిని మెరుగుపరుస్తాయి. ఖర్జూరాలను మధ్యాహ్న ఆహారానికి ముందు తీసుకోవచ్చు. వీటిని నట్స్‌తో చేర్చి తీసుకోవచ్చు. అది శరీర శక్తిని పెంచుతుంది. స్నాక్స్‌గా ఖర్జూరాలను తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.