ఉడికించిన పెసలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పెసలు. ఉడికించిన పెసల్లో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ శరీరో రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతాయి. పెసలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పెసల్లో విటమిన్స్ హోర్మోన్లను ప్రేరేపించడంలో, పిల్లల పెరుగుదలకు తోడ్పడుతాయి. వయస్సు పైబడుతుందని బాధపడేవారు పెసల్ని తీసుకుంటే వారి అసలు వయస్సు కన్నా పదేళ్లు తక్కువగా కనిపిస్తారు. పెసల్లోని కాపర్ చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.
హైబీపీ రోగులకు పెసలు చాలా మంచివి. ఉడికిన వాటిని తింటుంటే హైబీపీ అదుపులో ఉంటుంది.
పెసల్లోని ఐరన్ శరీర అవయవాలకు కావలసిన ఆక్సిజన్ సమృద్ధిగా అందిస్తుంది. పెసల్లో క్యాలరీలు చాలా తక్కువ. వీటిల్లోని ఫైబర్ పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పెసల్లోని క్యాల్షియం ఎముకల బలానికి దోహదపడుతాయి.