బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 15 జులై 2023 (16:19 IST)

మహాబీర విత్తనాలను రాత్రిపూట నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే ఏమవుతుంది?

knee
మహాబీర విత్తనాలు. ఈ విత్తనాలను ఇచ్చే మొక్క చూసేందుకు అచ్చం తులసి మొక్కలా కనబడుతుంది. ఐతే ఈ మొక్క ఆకులు కాస్త పెద్దవిగా కనబడుతాయి. ఈ మహాబీర విత్తనాలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మహాబీర విత్తనాలు మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు మహాబీర విత్తనాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి.
 
ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. మహాబీర విత్తనాల్లో క్యాల్షియం, విటమిన్ డి, జింక్ వంటి పోషకాలు వున్నాయి. మహాబీర చెట్టు ఆకుల రసాన్ని చర్మవ్యాధులైన గజ్జి, తామరపై లేపనం చేస్తే తగ్గిపోతాయి. మహాబీర విత్తనాల్లో వున్న యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కేన్సర్ వంటి వాటిని నిరోధిస్తుంది.