1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Papaya seeds health benefits

టీ స్పూన్ బొప్పాయి విత్తనాలు తీసుకుంటే?

Papaya seeds
ఆరోగ్యం విషయంలో ప్రకృతి ప్రసాదించిన పండ్లను తీసుకోవాలి. వీటిలో బొప్పాయి పండు ఒకటి. బొప్పాయి విత్తనాలు జస్ట్ ఓ టీ స్పూన్ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఏంటి బొప్పాయి విత్తనాలు తినాలా వామ్మో అనుకోవద్దు. బొప్పాయి పండుతో మధుమేహం, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులకు చెక్ పెట్టవచ్చునని పరిశోధనలో తేలినట్లు కరాచీ యూనివర్శిటీ విద్యార్థులు తెలిపారు. 
 
వృత్తిలో ఏర్పడే చికాకులు, ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు అనారోగ్యానికి కారణమవుతుంటాయి. ఇందులో భాగంగా మధుమేహం, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులు ఇలానే కబళిస్తుంటాయి.
 
అయితే, బొప్పాయి పండుతో వీటన్నిటికి చెక్ పెట్టవచ్చని కరాచీ యూనివర్శిటీ విద్యార్థులు అంటున్నారు. బయట విరివిగా దొరికే బొప్పాయిలో ఈ వ్యాధి కారకాలను నియంత్రించే గుణం మెండుగా ఉందని వారు తమ పరిశోధనల్లో తేల్చారు. అయితే, బొప్పాయి ఫలం కంటే వాటి విత్తనాలే మిక్కిలి ఔషధ విలువలు కలిగి ఉన్నాయట. 
 
రోజూ ఓ స్పూన్ బొప్పాయి విత్తనాలు తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులే కాకుండా కిడ్నీ, కాలేయం, ఉదర సంబంధ వ్యాధులు కూడా దరిచేరవని హామీ ఇస్తున్నారు.
తర్వాతి కథనం
పాతాళానికి చికెన్ ధరలు .. ఆ పండు ధరకు రెక్కలు