శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 12 మార్చి 2020 (22:27 IST)

దానిమ్మ పండు రసంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే...

దానిమ్మ పండు రసంలో కొద్దిగా తేనె కలుపుకుని రోజూ ఉదయం ఆహారం తీసుకున్న తర్వాత తాగితే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రొత్త రక్తం ఉత్పత్తి అవడమే కాక శరీరం కాంతివంతంగా మారుతుంది.
 
ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవారు దానిమ్మపండు తింటే శారీరక శక్తి, దేహపుష్టి చేకూరతాయి. అదేవిధంగా గొంతు, ఛాతీ, మరియు గర్భాశయానికి శక్తినిస్తుంది. 
 
దానిమ్మపండు తింటే ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి. అధిక దాహాన్ని అణచివేస్తుంది. దానిమ్మపండు రసంలో పటికబెల్లం పొడి(కలకండ పొడి)కలిపి తాగితే శరీరానికి చలువజేస్తుంది, జ్వరం తగ్గిపోతుంది.
 
మలబద్దక సమస్య ఉన్నవారు మూడు రోజులు వరుసగా దానిమ్మపండు తింటే సమస్య పారిపోవడం ఖాయం.