ఇవి తింటే అవన్నీ తగ్గిపోతాయ్, ఏంటవి?
ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. అజీర్తిని తగ్గిస్తాయి. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగొడుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. కరివేపాతో రక్తహీనత మాయమవుతుంది. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
గుమ్మడికాయ మూత్ర సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. బీట్ రూట్ బీపీని క్రమబద్దీకరిస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.