సోమవారం, 26 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (22:32 IST)

స్థూలకాయానికి మిరపకాయకి లింకేంటి?

ఉప్పూ, కారం సరైన మోతాదులో పడితేనే ఏ వంటకానికైనా రుచి. అయితే మిరప రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా అవసరమే అంటున్నారు నిపుణులు. మిరపలో ఉండే క్యాప్సైసిన్ అనే ఆల్కలాయిడ్ దాని ఘాటుకు కారణం. 
 
మిరప క్యాన్సర్ నిరోధకంగా, గుండె మంటను తగ్గించేదిగా, బీపీని నియంత్రించేదిగా, యాంటీ బ్యాక్టీరియాగా ఇలా చాలా రకాలుగా క్యాప్సైసిన్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్‌నీ, మధుమహేన్నీ హైపర్ టెన్షన్‌నూ పూర్తిగా తగ్గించలేకున్నా, వాటి నివారణలో ఎంతో సాయం చేస్తుంది. మిరపలో విటమిన్ 'సి' కూడా అధికంగా ఉంటుంది. రక్తనాళాలు, చర్మం, శరీర అవయవాల మధ్య సమన్వయం దీనివల్లే సాధ్యం. 
 
మిరపజాతికి చెందిన వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అవి జీవ‌క్రియను వేగవంతం చేసి కొవ్వుల్ని కరిగిస్తాయి. కొంతమేర ఆకలిని తగ్గించి స్థూలకాయ నివారణకు సాయం చేస్తాయని క్లినికల్ న్యూట్రిషన్ మ్యాగజైన్ పరిశోధనలో తేలింది. అలాగని ఎక్కువుగా కాదు. తగిన మోతాదులోనే తీసుకోవాలనేది వారి మాట. ఇప్పటికే కడుపులో మంట సమస్యతో బాధపడేవారు మాత్రం మిరపను తగ్గించి తినడమే మంచిదట.