శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (20:12 IST)

గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు కలిపి పౌడర్‌లా చేసుకుని తీసుకుంటే?

ఇంట్లో వంట దినుసుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయి. గసగసాలే తీసుకోండి. వాటిలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు తలా 100 గ్రాములు తీసుకుని పౌడర్‌లా చేసుకోవాలి. ఇందులో ఓ స్పూన్ పౌడర్‌ను ఉదయం-సాయంత్రం తీసుకుంటూ వస్తే శరీరానికి బలం చేకూరుతుంది. గసగసాలు, జీడిపప్పు రెండింటిని సమపాళ్ళలో తీసుకుని.. పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు మాయమవుతుంది. 
 
గసగసాలు, సగ్గుబియ్యం, బార్లీ మూడింటిని పదేసి గ్రాములు తీసుకుని బియ్యంతో చేర్చి జావలా తీసుకుంటే నడుము నొప్పి నయం అవుతుంది. కొత్తిమీరతో పాటు 20 గ్రాముల గసగసాలు చేర్చి రుబ్బుకుని పేస్టులా తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. 
 
గసగసాలు, మిరియాలు బాదం, కలకండను సమపాళ్లలో తీసుకుని పొడి చేసుకుని.. అందులో పాలు, తేనె, నెయ్యితో కలిపి పేస్టులా చేసుకుని... రోజూ అరస్పూన్ రాత్రి పాలలో చేర్చి తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. గసగసాలను దానిమ్మరసంలో నానబెట్టి రుబ్బుకుని తాగితే.. నిద్రలేమిని దూరం చేసుకుంది.
 
నోటిపూతను దూరం చేసుకోవాలంటే.. అర కప్పు టెంకాయ తురుముతో.. అర స్పూన్ గసగసాలను చేర్చి రుబ్బుకుని.. పచ్చడిలా తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. గసగసాలను కొబ్బరి పాలలో నానబెట్టి తీసుకుంటేనూ నోటిపూతను దూరం చేసుకోవచ్చునని నిపుణులు అంటున్నారు.