శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (12:53 IST)

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా వుండాలంటే.. గసగసాలను..?

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా వుండాలంటే.. గసగసాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు... కాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.

గసగసాల్లో పీచు ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తాయి. తద్వారా అజీర్తిని దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
గుండె సమస్య ఉన్నవారు గసగసాలను లేతగా వేపి.. ఉదయం, సాయంత్రం అర స్పూన్ మేర తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.  రాత్రి పూట నిద్రపట్టకపోతే... రోజు పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్‌ను కొద్దిగా కలిపి తాగితే చాలు హాయిగా నిద్ర వచ్చేస్తుంది. కానీ గసగసాలు చలవ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడొచ్చు.