చలికాలంలో అల్లం, వెల్లుల్లిని తీసుకుంటే?
చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చునో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకూడదంటే.. వ్యాధినిరోధక శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. హాయిగా నిద్రపోవాలి.
వ్యాయామం తప్పనిసరిగా వుండాలి. ముఖ్యంగా అల్పాహారంలో ఓట్స్ వుండేలా చూసుకోవాలి. నట్స్, యాపిల్స్, పియర్స్, క్రాన్‌బెర్రీస్ వంటివి తీసుకోవాలి. అలాగే పాలకూర, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఇంకా మాంసాహారంలో చేపలు, కోడిగుడ్లు వంటివి చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అల్లం, వెల్లుల్లిని డైట్‌లో చేర్చుకుంటే జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.