మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 5 మార్చి 2020 (20:50 IST)

ద్రాక్ష పండ్ల రసంలో ఏమేమి వుంటుందో తెలుసా?

చలికాలం పోయి ఇప్పుడే మెల్లగా వేసవి వచ్చేస్తోంది. ఎండ పెరుగుతూ వుంటే మెల్లగా శీతలపానీయాల గిరాకీ పెరుగుతుంటుంది. ఐతే ఏవేవో కూల్ డ్రింక్స్ తాగేకంటే నల్ల ద్రాక్ష రసాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది. శరీరం కోల్పోయిన ఖనిజ లవణాలను అందించడంతో పాటు శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లనీ ద్రాక్ష పండ్లు అందిస్తుంది. 
 
సహజంగా వేధించే అలర్జీలు, వాపు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఈ యాటి ఆక్సిడెంట్లు కాపాడతాయని వారు చెపుతున్నారు. 100 గ్రాముల ద్రాక్ష నుంచి 69 క్యాలరీల శక్తి అందితే కొలెస్ట్రాల్ జీరో శాతం ఉంటుందంటున్నారు. విటమిన్ సి, విటమిన్ ఎ, కెరోటిన్, రాగి, మెగ్నీషియం, బీకాంప్లెక్స్ విటమిన్లతో పాటు ప్రధాన ఎలక్ట్రోలైట్ అయిన పొటాషియం అధికంగా ఉంటుంది.