1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. people who eat Ivy Gourd should know

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Ivy Gourd
దొండ కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెపుతుంది. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దొండ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
 
దొండ కాయలోని గుణాలు కాలేయంకి మేలు చేస్తాయి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించగలవు.
దొండ కాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు దరిచేరనీయవు.
దొండలోని బి-విటమిన్‌ నాడీవ్యవస్థకు మేలు చేసి ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి బాగా పనిచేస్తుంది.
రిబోఫ్లేవిన్‌ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ తగ్గడానికి దోహదపడుతుంది. 
దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడనీయదు, ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది. 
దొండ కాయ ఆకుల పేస్టును మాత్రల్లా చేసుకుని వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మ సమస్యలు వుండవు.
దొండ కాయ పిత్త వ్యాధులను, రక్తపోటును, వాత వ్యాధులను నియంత్రిస్తుందని ఆయుర్వేదం చెపుతోంది.
 
తర్వాతి కథనం
హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు