గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (23:06 IST)

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

Dr Ravinder Reddy
హైదరాబాద్: వేసవి సమీపిస్తున్న కొద్దీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అంటువ్యాధులు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి, డీహైడ్రేషన్‌ను మరింత ఆందోళనకరంగా మారుస్తాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే వరకు ఇది గుర్తించబడదు. డీహైడ్రేషన్ సాధారణంగా తీవ్రమైన దాహంతో ముడిపడి ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో, ఇది సూక్ష్మంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా నిశ్శబ్ద డీహైడ్రేషన్ రూపంలో ఉండటం చేత తరచుగా ఇది గుర్తించబడదు. దీనికితోడు, ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణశయాంతర సమస్యల వల్ల కలిగే అతిసార నిర్జలీకరణం, ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా వున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గతంలో అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులలో ఇది మరింత సమస్యగా పరిణమించవచ్చు. 
 
హైదరాబాద్ యొక్క వేడి వాతావరణం, దాని నీటి వనరులు తక్కువగా కూడిన పరిసరాలతో సహా ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాలు డీహైడ్రేషన్ ప్రమాదాలను మరింత పెంచుతాయి. నగర నివాసితులు దీర్ఘకాలిక వేడి, అప్పుడప్పుడు నీటి కొరతను ఎదుర్కొంటున్నందున, తగినంత పరిమాణంలో నీటిని వినియోగించని వ్యక్తులు డీహైడ్రేషన్ సంబంధిత ఆరోగ్య సమస్యల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలు వున్నాయి. డీహైడ్రేషన్ యొక్క వివిధ కారణాలు, లక్షణాలను అర్థం చేసుకోవడంతో పాటు, వేగంగా కోలుకోవడానికి తగిన హైడ్రేషన్ పరిష్కారాలను కూడా నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
 
హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బి. రవీందర్ రెడ్డి నిశ్శబ్ద డీహైడ్రేషన్ యొక్క రహస్య ప్రమాదాలను నొక్కి చెబుతూ, “తీవ్రమైన దాహం వంటి సాధారణ హెచ్చరిక సంకేతాలను ప్రేరేపించకుండా, శరీరం ద్రవాలు, అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను కోల్పోయినప్పుడు నిశ్శబ్ద డీహైడ్రేషన్ సంభవిస్తుంది. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్న వ్యక్తులలో ఆందోళన కలిగిస్తుంది, వారు ఇప్పటికే రక్తంలో అధిక చక్కెర స్థాయిల కారణంగా ద్రవ సమతుల్యతలో హెచ్చుతగ్గులను అనుభవించవచ్చు. తగినంత ద్రవాహారం తీసుకోకపోవడం, కఠినమైన వ్యాయామం, అధిక ఉష్ణోగ్రతలు, మద్యం సేవించడం, జ్వరం, వికారం, వాంతులు వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారకాలు ఉండటం వల్ల డయాబెటిక్ రోగులకు డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతాయి.
 
తేలికపాటి డీహైడ్రేషన్ కూడా మెదడు పనితీరు, మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిశ్శబ్ద డీహైడ్రేషన్‌ సమస్యను నిర్వహించడానికి, నిరోధించడానికి, సాదా నీటి కంటే ఎలక్ట్రోలైట్ ఆధారిత హైడ్రేషన్ సొల్యూషన్‌లను తీసుకోవడం మంచిది. సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్‌లు కణజాల సమతుల్యతను నిర్వహించడానికి, ద్రవ అసమతుల్యతను నివారించడానికి సహాయపడతాయి. మధుమేహం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు మూత్రవిసర్జన అధికంగా చేయటం, మారిన దాహపు అలవాట్ల కారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. క్రమం తప్పకుండా ద్రవాహారం తీసుకోవడం, తక్కువ చక్కెరతో ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలను కలుపుకోవడం, హైడ్రేషన్ మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక చక్కటి విధానం" అని అన్నారు. 
 
ఇదే సమయంలో అతిసార డీహైడ్రేషన్‌ యొక్క ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మిగిలిపోయింది, ముఖ్యంగా పిల్లలలో అని, RVM మెడికల్ కాలేజీలోని పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ సి. సురేష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, "అంటువ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్ లేదా జీర్ణశయాంతర రుగ్మతల కారణంగా వేగంగా నీటిని కోల్పోవడం వల్ల అతిసార డీహైడ్రేషన్‌ సంభవిస్తుంది. నిశ్శబ్ద డీహైడ్రేషన్‌ వలె కాకుండా, దాని ప్రభావాలు ఆకస్మికంగా మరియు తీవ్రంగా ఉంటాయి, ఇది రక్త పరిమాణం, అవసరమైన పోషకాలలో గణనీయమైన తగ్గుదలకు దారితీస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది షాక్, అవయవ వైఫల్యం లేదా మరణం వంటి సమస్యలకు దారితీస్తుంది.
 
అతిసార డీహైడ్రేషన్‌‌ను నిర్వహించడానికి బంగారు ప్రమాణం WHO సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ లవణాలు(ORS). ఎలక్ట్రోలైట్లు, గ్లూకోజ్ యొక్క ఈ శాస్త్రీయంగా రూపొందించబడిన మిశ్రమం ద్రవాల యొక్క సరైన శోషణను నిర్ధారిస్తుంది, కోల్పోయిన ద్రవం, ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడంలో సహాయపడుతుంది. తీవ్రమైన డీహైడ్రేషన్‌‌ను నివారించడానికి అతిసారం యొక్క ప్రారంభ సంకేతాల వద్ద ORS అందించటం ప్రారంభించడం చాలా ముఖ్యం. అదనంగా, తగినంత ఆహారం(వైద్యుడు సిఫార్సు చేసినట్లు) జింక్ సప్లిమెంటేషన్ పిల్లలు వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి. చాలామంది ప్రజలు పొడి ORS ను కలిపేటప్పుడు తయారీ విధానంలో తప్పులు చేస్తారని, ఇది మార్పు చెందిన ఓస్మోలాలిటీ, తగ్గిన ప్రభావానికి దారితీస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. సరైన తయారీ పద్ధతి గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే, త్రాగడానికి సిద్ధంగా ఉన్న ORS ఫార్ములేషన్‌లను ఎంచుకోవడం ఉత్తమం. ORS గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ముందస్తు జోక్యం చేసుకోవడం వల్ల అతిసార వ్యాధుల భారం గణనీయంగా తగ్గుతుంది.." అని అన్నారు, 
 
వేసవి కాలం ప్రారంభం కావడంతో, నిపుణులు డీహైడ్రేషన్‌‌తో పాటుగా డీహైడ్రేషన్‌‌కు కారణమయ్యే వివిధ పరిస్థితులు, అలాగే వేగవంతమైన రీతిలో  కోలుకోవడానికి సమగ్ర పరిష్కారాల గురించి అప్రమత్తంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు. ఎలక్ట్రోలైట్-ఆధారిత పరిష్కారాల ద్వారా నిశ్శబ్ద డీహైడ్రేషన్‌‌ను నిర్వహించడం లేదా WHO, ORS ఫార్ములేషన్‌లతో అతిసార డీహైడ్రేషన్‌ సమస్యను పరిష్కరించడం, తగిన చర్యలు తీసుకోవటం, సకాలంలో జోక్యాలను చేసుకోవటం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కీలకం. ముఖ్యంగా వేడి వాతావరణంలో తగినంత నీరు తీసుకోవటం చేయాలని, అవసరమైనప్పుడు వైద్య సహాయం పొందాలని నివాసితులకు సూచించటమైనది.