గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (22:40 IST)

ఫుడ్ ఎలర్జీ తగ్గాలంటే ?!

భార్యాభర్తలిద్దరూ మంచివారైతే వారిద్దరి మధ్య ఏ గొడవులు రాకుండా జీవితం సాఫీగా నడుస్తుంది. అదే మాదిరిగా అటు ఆహారము, ఇటు శరీరము రెండూ (ఆహారము ప్రకృతిసిద్ధంగా ఉండి, శరీరము కూడా సహజంగా ఉంటే ఒకే విధముగా ప్రకృతి సహజముగా ఉంటే వాటి మధ్య ఏ గొడవా (ఎలర్జీ)రాదు.

భార్యాభర్తలిద్దరూ చెడ్డవారైనా వారిమధ్య ఏ గొడవులూ ఉండవు. వాళ్ళిద్దరూ బాగా కలిసిపోతారు. అలాగే, అటు ఆహారము చెడ్డదిగా ఉంది. ఇటు శరీరము కూడా చెడిపోయి అసహజంగా ఉంటే ఈ రెండూ కలిసిపోయి ఏ ఎలర్జీ రాదు. ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు అయినప్పుడే గొడవలు మొదలయ్యేది.

ఈ మధ్య జనాలకు, తేనెకు, కొబ్బరికి, నిమ్మకాయలకు ఇతర పులుపులకు, ఎండకు, మంచుకు, దుమ్ముకు, కూరగాయలకు, గింజలకు (ఇవన్నీ ప్రకృతి సిద్ధమైనవి) మొ॥గు వాటితో ఎలర్జీ వస్తున్నది. ఇలాంటి వాటికి ఎలర్జీ వస్తున్నదంటే శరీరంలో అసహజమైనవి నిల్వయుండి, ఎలర్జీని కలిగించే పదార్థాలు పుట్టి, లోపల అసహజంగా మారి పైన చెప్పినలాంటివి తగిలే సరికి దురదలు, దద్దుర్లు, వాపులు, గొంతులో తేడాలు మొ||వి వచ్చేస్తాయి.

అవి పడటంలేదు కాబట్టి, వాటిని పూర్తిగా మానేస్తే పోతుందిగదా అని వాటిని మానివేస్తూ ఉంటారు. లోపల అసహజత పెరుగుతూ నిదానంగా ఇతర ప్రకృతి సిద్ధమైన ఆహారాలకు కూడా ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. మాంసం పడడం. లేదని కానీ, ఆవకాయ పడడంలేదని, చాక్లెట్లు, బిస్కెట్లు పడడం లేదని డాక్టరు దగ్గరకు వెళ్ళి వీటికి నాకు ఎలర్జీ వస్తుందనే వారు ఎవరన్నా ఉన్నారా?

ఇలాంటివి శరీరానికి బాగా పడుతున్నాయి. మన శరీరం చెడిపోయి ఉండేసరికి చెడులో చెడు పడే సరికి కలిసిపోతున్నాయి. రా, రా! మనమిద్దరం ఫ్రెండ్స్ అంటూ కలుస్తాయి. ఎలర్జీ పోవాలంటే వేటినీ మానడం పరిష్కారం కాదు, మనలో ఎలర్జీకి మూలాన్ని కడిగివేసి శరీరాన్ని సహజంగా మార్చుకుంటే అన్నీ మళ్ళీ పడతాయి.
 
చిట్కాలు:-
 1మంచినీరు తక్కువగా త్రాగేవారికి ఎక్కువగా ఎలర్జీలు వస్తాయి. కాబట్టి 5 లీటర్ల నీరు ప్రతిరోజూ అలవాటు చేసుకోవాలి. 
2) ముందు 2, 3రోజులపాటు తేనె నీళ్ళలో ఉపవాసం (నిమ్మపడకపోతే మానివేసి పట్టితేనె+నీళ్ళు త్రాగవచ్చు) చేస్తే మంచిది. ఉపవాసంలో అవసరమైతే కొబ్బరినీళ్ళు రెండవ, మూడవ రోజుగానీ త్రాగవచ్చు
. 3) నాల్గవ రోజు నుండీ ఏ పండ్లు పడితే, ఏ రసాలు పడితే వాటితోనే రోజుకి 5, 6సార్లుగా అందులోనే తేనె వేసుకుని త్రాగుతూ 3, 4 రోజులుంటే మంచిది. చెరుకురసం పడితే త్రాగవచ్చు.
 4) ఆ తరువాత రోజు నుండీ ఉదయం పూట 8 గం॥ లకు రసాలు, 9, 10 గంటలకు పండ్లు తిని మధ్యాహ్నం భోజనంలో పుల్కాలతో చప్పటి కూర (ఏది పడితే ఆ కూర తో తిని, సాయంకాలం 5, 6 గం॥లకు పండ్లు తిని ఆపాలి.

ఇలా 5,6 రోజులు చేస్తే శరీరం లోపల శుభ్రం అయి, రక్తం మారి కొంత సహజత్వము వస్తుంది. 5) ఇలా 10, 12 రోజులు గడిచాక మీకు పడని వాటిని మెల్లగా ఒక్కొక్కటీ అలవాటు చేసుకుంటే అవే సరిపడుతుంటాయి. లేదా ఇంకో 10 రోజుల తరువాతనైనా అలవాటు చేసుకోండి. ఎవరికన్నా ఇంకా తగ్గకపోతే ఆహారము, ఉప్పు నూనెలు సొంతం మాని తింటే అప్పుడు పూర్తిగా తగ్గిపోతాయి.