1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. warm water drink in empty stomach health benefits

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీటిని తాగితే?

Pure water
మంచినీరు. నీటిని తాగడం చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. కానీ ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో తెలుసుకుందాము.
 
ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే పరగడుపున నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. 
పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. 
శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు బయటకి వెళ్లిపోతాయి. 
రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. 
బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి. 
కండరాలు బలపడి చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగడం అవసరం. 
చర్మం తగినంత తేమతో పాటు సహజంగా, మృదువుగా ఉంటుంది. 
జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేరకు పెరుగుతుంది. 
మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు, జీర్ణశక్తి, ఆకలి పెరుగుతుంది. 
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
రోజూ బాదం పప్పు తినడం వల్ల పెద్దల్లో మెరుగైన నిద్ర నాణ్యత