1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Why you need to take Raagi malt

రాగి జావలో ఏమున్నదో తెలుసా?

రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉండే విటమిన్లు వయసు మీద పడకుండా చేస్తాయి. రాగులలో వుండే ఎమినో యాసిడ్

Raagi malt
రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉండే విటమిన్లు వయసు మీద పడకుండా చేస్తాయి. రాగులలో వుండే ఎమినో యాసిడ్స్ త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. శరీర బరువును నియంత్రిస్తాయి. దీనిలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. 
 
నడి వయసు మహిళల్లో ఎముకలు పటుత్వం తగ్గుతుంది కాబట్టి ఈ రాగిజావ తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టంగా అవుతాయి. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి. ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు రోజువారీ ఆహారంలో రాగులను చేర్చుకొనడం ద్వారా తక్షణ శక్తి వస్తుంది. 
 
అంతేగాక రాగులను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత అయోడిన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. రాగులతో చేసిన ఏ ఆహారమైనా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించి మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. రాగుల జావ దప్పికను అరికడుతుంది.
About Writer
chj
తర్వాతి కథనం
ఏ ఆకులో ఏముందో తెలుసా? అదే....