శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 20 నవంబరు 2017 (20:01 IST)

పొట్లకాయ తినేవారు ఇది చదవాల్సిందే...

పొట్లకాయను తరచూ కూరల్లో ఉపయోగిస్తుంటాం. పొట్లకాయను కొంతమంది బాగా ఇష్టపడతారు. పాలు, పొట్లకాయను ఇష్టంగా వండుకుని తింటుంటారు. పొట్లకాయలోని ఔషథ గుణాలు ఎన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పొట్లకాయలోని పోషకాలు, అది చేసే మేలు ఎంతో వుంది.

మన శరీరానికి కావాల్సిన డైటరీ ఫైబర్ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి. షుగర్ వ్యాధికి పొట్లకాయ ఎంతో దోహదం చేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువ. తరచూ పొట్లకాయ తినడం, పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అజీర్తి లేకుండా చేస్తుంది.
 
పొట్లకాయ తినడం వల్ల శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది. విటమిన్ సి పవర్‌పుల్ యాంటీ యాక్సిడెంట్‌లుగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. రక్తపోటు సమస్యను అదుపులోకి ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.