శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: ఆదివారం, 12 నవంబరు 2017 (17:50 IST)

ఈ ఒక్క కాయతో 70 వ్యాధులు నయం...

మునక్కాయల్లో మనకు మేలు చేసే విటమిన్లు, పోషక విలువలు చాలానే ఉన్నాయి. మునక్కాయలోని ఔషధ విలువలు మన శరీరానికి ముఖ్యమైనవి. మునక్కాయల్లో కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. చిన్నపిల్లల్లో ఎదుగుదలకు మునక్కాయ బాగా ఉపయోగపడుతుంది. గర్భవతులకు మంచి

మునక్కాయల్లో మనకు మేలు చేసే విటమిన్లు, పోషక విలువలు చాలానే ఉన్నాయి. మునక్కాయలోని ఔషధ విలువలు మన శరీరానికి ముఖ్యమైనవి. మునక్కాయల్లో కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. చిన్నపిల్లల్లో ఎదుగుదలకు మునక్కాయ బాగా ఉపయోగపడుతుంది. గర్భవతులకు మంచి ఆహారం. ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. అంతేకాదు బిడ్డ పుట్టిన తరువాత పిల్లలకు పాలు పట్టడానికి కూడా మునక్కాయలు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా పోరాడుతుంది. యాంటీబాక్టీరియల్‌గా బాగా పనిచేస్తుంది. విటమిన్-సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ ఉన్న వారిలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసి సహాయం చేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్న వారికి మంచి ఆహారం మునక్కాయలు. 
 
రక్తాన్ని శుద్థి కూడా చేస్తుంది. అంతేకాదు శృంగార సామర్థ్యాన్ని పెంచి వీర్యవృద్థి కలిగేలా చేస్తుంది. ఇందులోని జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంచి దాంపత్య జీవితంలో అధిక ఆనందాన్ని పొందేలా సహాయం చేస్తుంది. తెలుగువారికి మునక్కాయ పులుసు అంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే.