శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: శనివారం, 28 అక్టోబరు 2017 (19:45 IST)

భోజనం తరువాత ఒక్క స్పూన్ సోంపు తింటే...?

సోంపుకు కొలెస్ట్రాల్‌కు ఉన్న లింకేంటి. సోంపు అంటే కొంతమంది ఇష్టపడతారు... మరికొంతమంది అసహ్యించుకుంటారు. ఇంట్లో గాని, రెస్టారెంట్‌లో గాని సోంపును తిన్న తరువాత సోంపును తినేవారు చాలామంది ఉంటారు. ఇది తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని చాలామంది నమ్ముతారు.

సోంపు ఎంత ఎక్కువగా తింటే అంత కొవ్వు కరిగిపోతుంది. సోంపు అనేది భోజనం చేసిన తరువాత తినే స్వీట్ పదార్థం అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. సోంపు త్వరగా జీర్ణం చేసి క్రొవ్వును బాగా కరిగిస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఒక టేబుల్ స్పూన్ సోంపును అన్నం తిన్న తరువాత తింటే నోట్లో లాలాజలం ఉత్పత్పై ఎసిడిటి సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తీసుకున్న ఆహారంలో నీటి శాతాన్ని గ్రహించి మలబద్ధకంలో నివారిస్తుంది. 
 
సోంపును రెగ్యులర్‌గా వాడితే బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్ దరిచేరనివ్వద్దు. అధిక బరువును తగ్గిస్తుంది. రోజూ సోంపు పౌడర్‌ను నీళ్ళలో కలుపుకుని తాగితే బరువు బాగా తగ్గుతారు. సోంపును అధికంగా వాడితే అంత ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.