సోమవారం, 9 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (20:21 IST)

అరటిపండ్లు ఎక్కువగా తింటే ఆ సమస్య... తగ్గాలంటే...

అజీర్తి సమస్య పలు రకాలుగా ఇబ్బంది పెడుతుంటుంది. దీన్ని నిరోధించేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అజీర్తికి కొంచెం బెల్లం తింటే సరిపోతుంది. రాత్రిళ్లు చపాతీలు

అజీర్తి సమస్య పలు రకాలుగా ఇబ్బంది పెడుతుంటుంది. దీన్ని నిరోధించేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అజీర్తికి కొంచెం బెల్లం తింటే సరిపోతుంది. 
 
రాత్రిళ్లు చపాతీలు ఎక్కువగా తినడం వల్ల కలిగే అజీర్తికి ఒక లవంగం తింటే సరిపోతుంది. 
 
అరటిపండ్లు ఎక్కువగా తింటే అజీర్తి కలుగుతుంది. ఈ స్థితిలో నేతిలో కొంచెం పంచదార కలిపి తీసుకుంటే అజీర్తి సమస్య తగ్గుతుంది. 
 
నేతితో తయారుచేసిన పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు అజీర్తి చేస్తే బాగా దాహం వేయడంతో పాటు కడుపులో వికారంగా వుంటుంది. అటువంటప్పుడు నిమ్మరసాన్ని మజ్జిగలో కలిపి కొంచెం ఉప్పు కూడా కలిపి తాగితే వెంటనే తగ్గిపోతుంది. 
 
మినప పప్పుతో చేసిన గారెలు, సున్నుండలు ఎక్కువగా తింటే కలిగే అజీర్తికి మజ్జిగ తాగితే సరిపోతుంది. కాస్త ఎక్కువగా భోజనం చేయడం వల్ల కలిగే అజీర్తికి మరమరాలు తింటే సరిపోతుంది.