ప్లాస్టిక్ బాక్స్‌లలో ఆహారం తింటే...
ఇపుడు ప్లాస్టిక్స్ బాక్స్‌లలో ఆహారాన్ని తీసుకెళ్ళడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఈ బాక్సుల్లో వేడివేడిగా ఉండే ఆహార పదార్థాన్ని మధ్యాహ్నం వరకు నిల్వ వుంచి ఆ తర్వాత ఆరగిస్తుంటారు. ఇలాంటి ఆహారం ఆరగించడం వల్ల కి
ఇపుడు ప్లాస్టిక్స్ బాక్స్‌లలో ఆహారాన్ని తీసుకెళ్ళడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఈ బాక్సుల్లో వేడివేడిగా ఉండే ఆహార పదార్థాన్ని మధ్యాహ్నం వరకు నిల్వ వుంచి ఆ తర్వాత ఆరగిస్తుంటారు. ఇలాంటి ఆహారం ఆరగించడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా.. ప్లాస్టిక్ కంటెయినర్లు ప్రధానంగా బైస్ఫినాల్ ఏ(బిపిఏ) అనే పదార్థంతో తయారు చేస్తారట. ముఖ్యంగా అది వేడి వేడిగా ఉండే పదార్ధాలతో కలిసినప్పుడు చెమ్మగిల్లిన తర్వాత ద్రవరూపంలో జారిపోతున్నప్పుడు ఆహారపదార్థాలకు అంటుకుని వాటిపై తేలిపోయే అవకాశం ఉందని వైద్యులు వివరిస్తున్నారు.
అదేసమయంలో ప్రకృతిలో అనేక పదార్థాలలో రకరకాల విషపదార్థాలు ఉంటాయి. వీటిలో ప్లాస్టిక్ కూడా ఒక రకమైన విషపదార్థమే. అందువల్ల వీటిలో నిల్వ చేసిన ఆహారాన్ని ఆరగించడం వల్ల కిడ్నీలను పాడు చేసే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెపుతున్నారు.