శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (15:43 IST)

వాటర్ బాటిళ్ళతో జాగ్రత్త... 3,13,499 సీఎఫ్‌యూ బ్యాక్టీరియాలు ఉంటాయట!?

సాధారణంగా బయటకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ తమవెంట వాటర్ బాటిళ్ళను తీసుకెళుతున్నారు. దాహం వేసినపుడు... ఎక్కడపడితే అక్కడ నీరు తాగకుండా ఉండేందుకు తమ వెంట నీళ్ళ బాటిల్స్ తీసుకెళుతుంటారు. అయితే, ఈ నీళ్ళ బాటిల

సాధారణంగా బయటకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ తమవెంట వాటర్ బాటిళ్ళను తీసుకెళుతున్నారు. దాహం వేసినపుడు... ఎక్కడపడితే అక్కడ నీరు తాగకుండా ఉండేందుకు తమ వెంట నీళ్ళ బాటిల్స్ తీసుకెళుతుంటారు. అయితే, ఈ నీళ్ళ బాటిల్స్‌ను శుభ్రం చేయకపోతే తీవ్ర వ్యాధులు తప్పవని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 
 
వాటర్ బాటిళ్ళలో నిల్వ ఉండే బ్యాక్టీరియాలపై ట్రెడ్‌మిల్స్‌ రివ్యూ అనే పత్రిక ఓ శాస్త్రీయ పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధనలో దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు వెల్లడయ్యాయి. 
 
ముఖ్యంగా క్రీడా మైదానంలో ఆటగాళ్లు వాడుతున్న 12 సీసాలను పరిశీలించింది. ఇందులో ప్రతిదాంట్లోనూ సగటున 3,13,499 సీఎఫ్‌యూ మేరకు బ్యాక్టీరియాలు ఉన్నాయట. వీటిలో అత్యధికంగా ఓ సీసాలో 9 లక్షల సీఎఫ్‌యూల మేరకు బ్యాక్టీరియాలు కనిపించాయట. 
 
ఈ లెక్కన మనం శుభ్రం చేయకుండా వాడే సీసాల్లో సూక్ష్మక్రిములు ఏ స్థాయిలో ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఇలా సీసాల్లో ఉండే బ్యాక్టీరియాల్లో 90 శాతం హానికారక క్రిములేనని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది.