ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం పాడైనట్టే...
మనిషి శరీరంలోని అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. ఇదే అతిపెద్ద అంతర్గత అవయవం కూడా. ఇది చాలా కీలకమైన పనులను నిర్వహిస్తుంది. ముఖ్యంగా శక్తిని నిల్వ చేయడం, అవసరం ఉన్నప్పుడు వాడటం, హార్మోన్లను కంట్
మనిషి శరీరంలోని అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. ఇదే అతిపెద్ద అంతర్గత అవయవం కూడా. ఇది చాలా కీలకమైన పనులను నిర్వహిస్తుంది. ముఖ్యంగా శక్తిని నిల్వ చేయడం, అవసరం ఉన్నప్పుడు వాడటం, హార్మోన్లను కంట్రోల్ చేయడం, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం వంటి అనేక పనులను లివర్ చేస్తుంది.
శరీరంలో ఉన్న విష పదార్థాలను కూడా కాలేయం బయటకు పంపుతుంది. దీంతో కొన్ని సార్లు లివర్ అనారోగ్యానికి గురై పలు లక్షణాలు మనకు కనిపిస్తాయి. వాటిని తెలుసుకుంటే లివర్ అనారోగ్యం బారిన పడిందని ఇట్టే చెప్పవచ్చు.
తీవ్రమైన అలసటగా ఉండటం, కామెర్లు బారినపడటం, నిస్సత్తువ ఆవరించడం, శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడం, రక్తం గడ్డ కట్టడం, ఆకలి లేకపోవడం, కాళ్లు, చేతులు వాయడం, చర్మ సమస్యలు ఉండటం వంటి లక్షణాలు కనిపించినట్టయితే ఖచ్చితంగా కాలేయం పాడైనట్టుగా గుర్తించాల్సి ఉంటుంది.